ప్రతిపక్షం, జూన్ 29: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ప్రజల్లోకి రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సవాల్ విసిరారు. సీఎం పదవిపై అహంకారంతో మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.
రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి కాదని, ముంపు మేస్త్రి అని ఎద్దేవా చేసిన హరీశ్ రావు, ఆయనకు నిద్రలో కూడా కేసీఆర్ గుర్తుకొస్తున్నారని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే రైతుబంధు సహా ప్రజా సమస్యలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రభుత్వం చేసిన పనులపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని సీఎం తీరును తప్పుబట్టారు.
















