ప్రతిపక్షం, జూన్ 17: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్ కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేశారు. ఇద్దరు డీసీపీలు, ఒక ఏసీపీ, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం అధికారితో కూడిన ఈ బృందం కేసులోని అన్ని కోణాలను పరిశీలిస్తోంది. ఇప్పటికే ఐదు కేసులు నమోదు కాగా, ప్రధాన నిందితుడు చంద్రశేఖర్ అలియాస్ అర్జున్‌తో పాటు ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా అర్జున్ సోదరుడు రాజీవ్‌ను మూడు రోజుల పోలీసు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు.

















