*మునుగోడులో 171వ పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా పరిశీలకురాలు.
*రెండు చోట్ల ఓటు ఉంటే ఒకచోట కొనసాగేలా చూడండి – అధికారులకు సూచన.
*మునుగోడు 171వ పోలింగ్ కేంద్రంలో బీఎల్ఓతో ముఖాముఖి.
ప్రతిపక్షం – మునుగోడు, అక్టోబర్ 27: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో ఫారాలు, ధ్రువపత్రాల పరిశీలన ముఖ్యమని జిల్లా ఓటరు జాబితా పరిశీలకురాలు శ్రీ దేవసేన అన్నారు. కొత్త ఓటర్ల నమోదు, తొలగింపులు, మార్పు చేర్పులను జాగ్రత్తగా పరిశీలించి చేయాలని సూచించారు.మంగళవారం మునుగోడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని 171వ పోలింగ్ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. బీఎల్ఓ పద్మతో మాట్లాడి సర్ నిర్వహణ తీరు, ఫారాల పరిశీలన, నోటీసుల జారీ, ఇంటింటి సర్వే వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఒక ఓటరుకు రెండు చోట్ల ఓటు ఉంటే ఒకేసారి రెండు చోట్ల తొలగించకుండా ఒకచోట కొనసాగేలా నిర్ధారించాలని, విఐపీ ఓటర్లు తప్పనిసరిగా జాబితాలో ఉండేలా చూడాలని, నోటీసు ఇచ్చిన ప్రతి ఓటరుకు హియరింగ్ తర్వాత తన పేరు ఉన్నదీ లేనిదీ తెలియజేయాలని చెప్పారు.నోటీసులు జారీ చేసిన ఓటర్లకు హియరింగ్ తర్వాత ఇంటికి వెళ్లి సమాచారం ఇస్తున్నామని కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, సబ్ కలెక్టర్ కరోలిన్, ఆర్డీవో శ్రీదేవి, తహసిల్దార్ తదితరులు పాల్గొన్నారు.





























