వనపర్తికి చెందిన బీటెక్ విద్యార్థిని సోనా మృతి

వనపర్తి ప్రతినిధి, అక్టోబర్ 18, ప్రతిపక్షం: హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన దాండియా వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది.రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్‌గుల్‌లోని ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం జరిగిన సంగమం- 2026 వేడుకల్లో భారీ లైటింగ్ ట్రస్ కూలిపడటంతో వనపర్తి జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థిని సోనా(18) మృతి చెందింది. ఈ ప్రమాదంలో మరో 25 మంది విద్యార్థులు గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.కళాశాలలో వెయ్యి మందికి పైగా విద్యార్థులు వేడుకల్లో పాల్గొన్నారు.ఈదురుగాలులు వీయడంతో అమ్మాయిల వైపు ఏర్పాటు చేసిన భారీ లైటింగ్ ట్రస్ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో పలువురు విద్యార్థులు దాని కింద చిక్కుకుని గాయపడ్డారు.క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించారు. చికిత్స పొందుతూ బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థిని సోనా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె కవల సోదరి మీనా కూడా ఈ ప్రమాదంలో గాయపడటంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Spread the love

Related News

Latest News