లంగర్‌హౌస్ లాడ్జ్‌లో యువతి మృతి.. అన్ని కోణాల్లో దర్యాప్తు

ప్రతిపక్షం, జూలై 03: హైదరాబాద్‌ లంగర్‌హౌస్‌ పరిధిలోని ఓ లాడ్జ్‌లో 26 ఏళ్ల యువతి అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. రేణుకగా గుర్తించిన యువతి హోటల్‌ గ్రాండ్‌ లాడ్జ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది.

పోలీసుల వివరాల ప్రకారం, రేణుక ఫారూఖ్‌ అనే వ్యక్తితో కలిసి లాడ్జ్‌లో గది తీసుకుంది. కొద్దిసేపటి తర్వాత బయటకు వెళ్లిన ఫారూఖ్‌ తిరిగి వచ్చేసరికి యువతి ఉరివేసుకుని ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

అయితే ఇది ఆత్మహత్య కాదని, తమ కుమార్తెను హత్య చేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న లంగర్‌హౌస్ పోలీసులు ఫారూఖ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించిన పోలీసులు, హత్యా లేదా ఆత్మహత్యా అన్న కోణంలో అన్ని అంశాలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Spread the love

Related News

Latest News