అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మేయర్

  • 51 లక్షలతో సీసీ రోడ్లు, పైపులైన్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన
  • కమీషనర్ ప్రఫుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు.

ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, జూన్ 29: “నగర ప్రజల జీవన ప్రమాణాలను మరింత పెంచేందుకు నిధులు కేటాయించి పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేస్తున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి లో భాగంగా సోమవారం రోజు 35 వ డివిజన్ కాపువాడలో కమీషనర్ ప్రఫుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, స్థానిక కార్పోరేటర్ సాధవేణి సుజాత శ్రీనివాస్ తో కలిసి మేయర్ కొలగాని శ్రీనివాస్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నగరపాలక సంస్థ కు చెందిన 51 లక్షల సాధారణ నిధులతో పలు కాలనీల్లో సీసీ రోడ్లు, ఎస్ డబ్ల్యూజి పైపులైన్ డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ ను ఆదేశించారు. అనంతరం కాపువాడ పలు కాలనీల్లో కమీషనర్, డిప్యూటీ మేయర్ తో కలిసి స్థానిక ప్రజల సమస్యలను తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నగరంలోని అన్ని డివిజన్లను సమాంతరంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మా పాలకవర్గం పని చేస్తుందని తెలిపారు. కాపువాడలో సుధీర్ఘ కాలంగా ఉన్న సిసి రోడ్లు, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రజల సమస్యల దృష్టిలో పెట్టుకొని ప్రాధాన్యత గా దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నాణ్యతతో పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మరో వైపు కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ.. నగర వ్యాప్తంగా చేపడుతున్న అభివృద్ధి పనులను ఇంజనీరింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం ఇంచార్జ్ ఈఈ లచ్చిరెడ్డి, స్థానిక మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News