Trending Now

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం..

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి చేరికలు

సిద్దిపేట కాంగ్రెస్ ఇంఛార్జి పూజల హరికృష్ణ

ప్రతిపక్షం, సిద్దిపేట ఏప్రిల్ 16: పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ని భారీ మెజార్టీ వచ్చేల కార్యకర్తలు కలిసి పని చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జీ పూజల హరికృష్ణ సూచించారు. సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పూజల హరికృష్ణ మాట్లాడుతూ.. మీకు ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకొస్తే నేను ఎప్పుడూ మీ వెంట ఉండి అట్టి సమస్యలను పరిష్కరించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు అందించవలసిన ఆరు గ్యారంటీలను ప్రభుత్వం ప్రతి పేదవాని గడపకు చేరే విధంగా పనిచేస్తుందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో 14 ఎంపీ సీట్లు గెలువటం ఖాయమని.. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు రెండు ఒకటే అని ప్రజలు ఎవరు నమ్మకూడదు అని అన్నారు. సిద్దిపేట నియోజకవర్గలో బీఆర్‌ఎస్ పార్టీ దుకాణం బంద్ అయిందని ప్రజలు అందరు కాంగ్రెస్ కి మద్దతు ఇస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు సాకి ఆనంద్, రియాజ్, బుచ్చిరెడ్డి, సిద్దిపేట రూరల్ మండల్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొత్తూరి నరహరి, సిద్దిపేట రూరల్ మండల అధ్యక్షుడు రాములు, పుల్లూరు బండ లక్ష్మి నరసింహ, దేవస్థానం ఛైర్మన్ కనకయ్య, కరీముద్దీన్, శ్రీశైలం మంద పాండు, రాజేవీర్ అరవిడ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News