Trending Now

మహిళలకు సముచిత గౌరవం ఇచ్చేది కాంగ్రెస్ మాత్రమే..

నిర్మల్ జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అల్లూరి కృష్ణవేణి..

నిర్మల్‌లో జోరందుకున్న మహిళా కాంగ్రెస్ ప్రచారం..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 2: దేశంలో మహిళలకు సముచిత గౌరవం ఇచ్చి వినూత్నమైన సంక్షేమ పథకాలు కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్లే సత్తా సమర్థం ఒక కాంగ్రెస్ కి ఉంటుందని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ మహిళ విభాగం ఉపాధ్యక్షురాలు అల్లూరి కృష్ణవేణి పేర్కొన్నారు. గురువారం నిర్మల్ రూరల్ మండలంలోని పోచంపాడు, నీలాయిపేట్ గ్రామాల్లో జరిగిన అదిలాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీమతి ఆత్రం సుగుణ ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. 60 ఏళ్లు కాంగ్రెస్ పాలించిన కాలంలో ఇంద్రమ్మ పేరిట, ఇతర పథకాల పేరిట మహిళలకు అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లిందని చెప్పారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలోని అన్ని వర్గాల మహిళలకు సమూచిత ప్రాధాన్యతనిస్తూ.. సంక్షేమ పథకాల ద్వారా ఆదుకుంటుందని భరోసా పంపించారు.

కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు ప్రతి ఏడు లక్ష రూపాయలు నగదు చొప్పున సహాయం చేయడంతో పాటు ఆయా సంక్షేమ పథకాలలో కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఉందని చెప్పారు. మహిళలకు అన్ని రంగాలలో రిజర్వేషన్లను కల్పించడంతోపాటు విద్యా, వైజ్ఞానిక రంగాలలో వారు ముందుకు వెళ్లేలా భవిష్యత్తు కార్యక్రమం చెప్పారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని గ్రామీణ ప్రాంతాలలో కల్పించి సీజనల్ ఉపాధిని కల్పించిన ఘనత కాంగ్రెస్ దేనని చెప్పారు. ఈసారి జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు వేసి అదిలాబాద్ జిల్లాలో మూడు రంగుల జెండా ఎగరవేద్దామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టో కూడిన కరపత్రాలను తలుపు తలుపు తట్టి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంబరి గంగాధర్ , ఎస్టి సెల్ జిల్లా అధ్యక్షుడు ధనావత్ గోవింద్ నాయక్,కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యకాంత్, వాసవి, భూమన్న, గంగ రాజు స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు.

Spread the love

Related News