ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ఈరోజుతో ముగిసింది. దీంతో ఈడీ అధికారులు కవితను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కాగా, మరో 5 రోజులు కవితను ఈడీ కస్టడీకి కోరింది. కవిత విచారణకు సహకరించడంలేదని.. మరింత సమాచారం రాబట్టాలని కోరింది. కాగా కోర్టులో ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు మరో 3 రోజులు కస్టడీ పొడిగించింది.