Anushka is getting married soon: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ఎట్టకేలకు పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఓ వ్యాపారవేత్తతో ఆమెకు వివాహం నిశ్చయమైనట్లు వినిపిస్తోంది. ఈ మేరకు ఇరు కుటుంబాల సభ్యులు కూడా మాట్లాడుకున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడనుందట. అరుంధతి, భాగమతి, బాహుబలి వంటి చిత్రాలతో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క.. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళీ, హిందీ చిత్రాల్లో నటించారు. బాహుబలితో పాన్ ఇండియా రేంజ్‌కు వెళ్లిపోయారు. అయితే ‘సైజ్ జీరో’ సినిమా కోసం అమాంతం బరువు పెరిగిపోయారు. దీంతో అవకాశాలు కూడా తగ్గాయి. గత ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ మూవీ చేసినా అది అనుకున్నంత హిట్ కాకపోవడంతో ప్రస్తుతం సెలెక్టివ్‌గా పాత్రలు ఎంచుకుంటున్నారు.