Trending Now

‘అవినీతి అధికారిపై చర్యలు తీసుకోండి’

ప్రతిపక్షం, రామగిరి (మంథని), ఏప్రిల్ 24 : నిరుద్యోగులకు శాపంగా మారిన అవినీతి సింగరేణి అధికారిపై చర్యలు తీసుకోవాలని ఐఎన్టీయూసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు ఉడుత శంకర్ యాదవ్ ఆర్జీ-3 జీఎం ఎన్. సుధాకర్ రావు నీ ఒక పత్రిక ప్రకటనలో కోరారు. భూనిర్వాసితులు సింగరేణి లో ఉపాధి పొందాలంటే మెడికల్ విటీసీ అవసరం.. దీన్ని ఆసరాగా చేసుకుని ఏరియా సేఫ్టీ కార్యాలయంలో సిస్టం ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న అతను తన లంచగొండితనంతో నిరుద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

మెడికల్ విటీసీ ఏరియా సేఫ్టీ ఆఫీసర్ నుండి పిఎంఈ కి వెళ్లే ముందు ఆన్లైన్ చేయాలి, కానీ ఇక్కడ డబ్బులు ఇచ్చినవారికి ఎలాంటి డాకుమెంట్స్ లేకుంట ఆన్లైన్ చేస్తూ.. ఇవ్వని వారిని కార్యాలయ చుట్టూ తిప్పుకుంటు, డబ్బులు ఇచ్చేంతవరకు ఆన్లైన్ చేయకుండా వారిని మెడికల్ టెస్ట్ కు వెళ్లకుండా ఆపుతున్నారనీ, ఓసిపి-2 ఏరియా సేఫ్టీ కార్యాలయంలో లంచలకు పాల్పడుతున్న సిస్టం ఆపరేటర్ని బదిలీ చేసి ఈ అక్రమాన్ని అరికట్టాలని కోరారు.

Spread the love

Related News