Delhi: ఢిల్లీ నూతన సీఎంగా అతిశీ ప్రమాణం

Atishi sworn in as Delhi’s new CM: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆప్‌ నేత ఆతిశీ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ నివాస్‌లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. ఆమెతో పాటు మరో ఐదుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. కేజ్రీవాల్‌ రాజీనామా చేయడంతో ఆప్‌ ఎమ్మెల్యేలు ఆతిశీని సీఎంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. దీంతో దేశ చరిత్రలో ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించిన 17వ మహిళగా అతిశీ నిలిచారు. అలాగే అత్యంత పిన్న వయసు (43)లోనే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన మహిళగా కూడా అతిశీ నిలిచారు.

Related News

Latest News