పిల్లల ఫోన్లలో అడల్ట్ యాడ్స్ కలకలం.. అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక

ప్రతిపక్షం, జూలై 10: హైదరాబాద్‌లో ఓ వ్యక్తికి ఎదురైన అనుభవం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. పిల్లలు యూట్యూబ్‌లో విద్యా సంబంధిత వీడియోలు చూస్తుండగా మధ్యలో అడల్ట్ కంటెంట్‌కు సంబంధించిన ప్రకటనలు కనిపించడంతో ఆయన ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను తీసి యూట్యూబ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ప్రస్తుతం పిల్లలు చదువుతో పాటు వివిధ సబ్జెక్టులను నేర్చుకునేందుకు యూట్యూబ్‌ను విస్తృతంగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఇలాంటి ప్రకటనలు కనిపించడం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది. చిన్నారులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉండటంతో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

పిల్లలు ఉపయోగించే మొబైల్ లేదా ట్యాబ్‌లలో రెస్ట్రిక్టెడ్ మోడ్ తప్పనిసరిగా ఆన్ చేయాలని, అలాగే గూగుల్ ఫ్యామిలీ లింక్ వంటి పేరెంటల్ కంట్రోల్ యాప్‌లను వినియోగించడం ద్వారా పిల్లలు ఏ కంటెంట్ చూస్తున్నారో పర్యవేక్షించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదనంగా అనుచిత ప్రకటనలు కనిపిస్తే వెంటనే వాటిని రిపోర్ట్ చేయడం, పిల్లలకు సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని కల్పించడం తల్లిదండ్రుల బాధ్యతగా పేర్కొంటున్నారు.

Spread the love

Related News

Latest News