- గుంజపడుగు హరిప్రసాద్ తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు
ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, జూలై 03: తెలంగాణ రక్షణ సేన జిల్లా నాయకురాలు కుతాడి రజిత గారి ఆద్వర్యంలో తిగలగుంటపల్లికి చెందిన చిదురు సుశీలవాణి గారు ఈరోజు కవితమ్మ నాయకత్వం పట్ల నమ్మకంతో తెలంగాణ రక్షణ సేనలో చేరడం జరిగింది సుశీలవాణి గారికి జిల్లా మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు అంకం శివరాణి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ కు కవితమ్మ అంటే భయం తెలంగాణ రక్షణ సేనను ఎదుర్కొనే దమ్ములేక పోలీసుల ముసుగులో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకం సృష్టించి అక్రమంగా నిన్న కవితమ్మను అరెస్ట్ చేసి తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసినారు. ఒక మాజీ పార్లమెంట్ సభ్యురాలు అనే గౌరవం కూడ లేకుండా పోలీసుల ఇష్టం వచ్చినట్లు వారిని క్రింద పడేయడం కారుకు వేసి గుద్దడం ఇదంతా ప్రభుత్వం పోలిసులతో కవితమ్మ చిత్రహింసలకు గురి చేయడాన్ని యావత్ తెలంగాణ సమాజం చూస్తుంది.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసింది. ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానం కానీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీ కానీ, ముసలోళ్లకు ఇస్తామని చెప్పిన పించను, విద్యార్థులకు స్కూటి బండి, మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు, తలం బంగారం ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన జిల్లా సీనియర్ నాయకులు రంగరవేణి లక్ష్మణ్, గర్షకుర్తి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

















