600 మంది చిన్నారులకు ఉచిత సైకిళ్లు.. జగ్గారెడ్డి సేవా కార్యక్రమం

ప్రతిపక్షం, జూన్ 06: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేపట్టిన ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటివరకు 600 మంది చిన్నారులకు సైకిళ్లు అందజేసిన ఆయన, పిల్లల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించడంతో పాటు చదువుపై ఆసక్తి కలిగించడమే తన లక్ష్యమని తెలిపారు.

5 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న చిన్నారులు ఆధార్ కార్డు, తల్లిదండ్రుల ఫోన్ నంబర్లతో నమోదు చేసుకోవాలని సూచించారు. పేర్లు నమోదు చేసుకున్న ప్రతి చిన్నారికి సైకిల్ అందజేస్తానని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి స్థానికంగా మంచి స్పందన లభిస్తోంది.

Spread the love

Related News

Latest News