మెదక్ కు ఖిల్లా దేశ విదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి: ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ జూలై 18: ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు మెదక్‌ పట్టణంలోని చారిత్రాత్మక మెదక్ ఖిల్లా ను సందర్శించారు. ఖిల్లా లోని చారిత్రక నిర్మాణాలను పరిశీలిస్తూ వాటి విశిష్టత గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ చారిత్రక ప్రాధాన్యత కలిగిన మెదక్ ఖిల్లాను రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఈ దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటే దేశ విదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే తాను నిర్మించబోయే తదుపరి సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను మెదక్ ఖిల్లా లో చిత్రీకరించే ఆలోచన ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, టూరిజం జిల్లా అధికారి రమేష్, మున్సిపల్ రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, కౌన్సిలర్స్ అఖిల్, హరిత, అరుణ, కో ఆప్షన్ తాహెర్, నాయకులు బొజ్జ పవన్, రాగి అశోక్, భూపతి రాజు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News