మెట్రో విస్తరణపై కిషన్ రెడ్డికి మరోసారి రేవంత్ లేఖ?

ప్రతిపక్షం, జూలై 04: తెలంగాణ మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మరోసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాయనున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన సమావేశంలో చర్చలు సానుకూలంగా ముగిసినా, కేంద్రం నుంచి తదుపరి చర్యలపై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

మెట్రో తొలి, రెండో దశల ప్రాజెక్టుల వ్యయాలను పరిశీలించే బాధ్యతలను ఎస్‌బీఐ క్యాప్స్‌కు అప్పగించాలని గత సమావేశంలో నిర్ణయించారు. అయితే ఇందుకు సంబంధించిన ఎస్‌బీఐ క్యాప్స్ బృందం, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల నియామకంపై ఇప్పటికీ స్పష్టత రాలేదని సమాచారం.

ఈ నేపథ్యంలో ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కేంద్రాన్ని కోరనున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Spread the love

Related News

Latest News