Trending Now

‘కేసీఆర్ రాజకీయ భిక్ష పెడితే తొలిసారి ఎంపీ అయ్యారు’..

చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఫైర్

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ లో చేరడం నయవంచన, దగా, వెన్నుపోటు అని బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రంజిత్ రెడ్డి కి కేసీఆర్ రాజకీయ భిక్ష పెడితే తొలిసారి ఎంపీ అయ్యారని.. రంజిత్ రెడ్డి అన్ని విధాలా ఎదగడానికి బీఆర్ఎస్ పార్టీయే కారణమని తెలిపారు. కేసీఆర్ అధికారం నుంచి దూరం కాగానే రంజిత్ రెడ్డి పార్టీకి దూరమవుతారా..? కష్టకాలం లో రంజిత్ రెడ్డి కి కేసీఆర్ కు అండగా ఉండాలి కానీ వెన్నుపోటు పొడుస్తారా..? అని ప్రశ్నించారు. చేవేళ్ల ఎంపీ స్థానం కాంగ్రెస్ టికెట్ ను రంజిత్ రెడ్డి వంద కోట్ల రూపాయలకు కొన్నారని కాంగ్రెస్ కార్యకర్తలు చర్చించుకుంటున్నారని.. జెండా మోసిన తమకు అన్యాయం చేసి రంజిత్ రెడ్డి కి టికెట్ ఎలా ఇస్తారని కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయన్నారు. తనకు మరోసారి ఎంపీ గా పోటీ చేసే ఉద్దేశం లేదని బీ ఆర్ ఎస్ లోనే కొనసాగుతానని రంజిత్ రెడ్డి చెబితే కేసీఆర్ గారు నమ్మారు. కానీ కేసీఆర్ నమ్మకాన్ని రంజిత్ రెడ్డి వమ్ము చేశారన్నారు. రంజిత్ రెడ్డి కి ఈ సారి ఓటమి ఖాయమని.. చేవెళ్లలో ముచ్చటగా మూడో సారి బీఆర్ఎస్ గెలవడం ఖాయమన్నారు.

Spread the love