ప్రతిపక్షం, ఏపీ: టీడీపీ-జనసేన కూటమి దూకుడు పెంచింది. శనివారం తొలి జాబితాను చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి విడుదల చేశారు. 94 స్థానాలపై టీడీపీ, 24 స్థానాలపై జనసేన పోటీ చేయనున్నట్లు చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. పొత్తులో భాగంగా మొదటి విడతలో జనసేనకు మొత్తం 24 స్థానాలు దక్కగా.. ఇందులో 5 అసెంబ్లీ స్థానాలకు జనసేనాని అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన 19 స్థానాలకు అభ్యర్థులో చర్చించి.. పేర్లు ఖరారు చేస్తామని తెలిపారు. ఇవాళ జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించిన స్థానాల్లో.. నాదెండ్ల మనోహర్-తెనాలి, లోకం మాధవి-నెల్లిమర్ల, కొణతాల రామకృష్ణ- అనకాపల్లి, బత్తుల బలరామ కృష్ణ- రాజానగరం, పంతం నానాజీ- కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థులుగా ఖరారయ్యారు.