Trending Now

ఒక్క విభజన హామీ నెరవేర్చలేదు.. బీజేపీపై మంత్రి పొన్నం ఫైర్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: బీజేపీ వచ్చాక తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమిటని.. మే13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారని బీజేపీపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైరయ్యారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ దళితులకు, బీసీలకు, మైనారిటీలకు వ్యతిరేకమని.. ఒక్క విభజన హామీ నెరవేర్చలేదన్నారు. అమరుల 7మండలాలు విద్యుత్ ప్రాజెక్టు ను ఆంధ్రకు అప్పజెప్పారని.. రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఏమైనవి..? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీకి ఎజెండా లేదు, మోడీ, అమిత్ షాలు దేశంలో నవరత్నాల కంపెనీలు అమ్మిన్రు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడి పేరున అక్షింతలు, కుంకుమ ప్రజలకు ఇచ్చి ఓట్లు అడుగుతున్నారని.. బీజేపీ భావోద్వేగాలతో రాజకీయాలు చేస్తుందని.. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ కు ఏమి చేసిండు.. చేనేత కార్మికులకు అండగా ఉన్నది కేవలం కాంగ్రెస్ యే అని స్పష్టంచేశారు. విభజన హామీలు అమలు చేయలేదని.. అమరుల బలిదానాలను అవహేళన చేశారని.. తెలంగాణ విభజనను బీజేపీ వ్యతిరేకించిందని.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అన్ని హామీలు అమలు చేస్తోందని.. మీ హాయంలో రూ. 3,016 నిరుద్యోగ భృతి ఏమైంది హరీష్ రావును ప్రశ్నించారు.

వర్షాకాలం బీఆర్ఎస్ అధికారంలో ఉందని.. ఎండాకాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు 25వందలు కూడా నష్ట పరిహారం ఇవ్వలేదు.. తాగు నీటి ఇబ్బందులు రాకుండా 10 మంది సీనియర్ అధికారులను నియమించామన్నారు. 14న బీజేపీ, బీఆర్ ఎస్ వైఫల్యాలపై దీక్ష చేస్తామని.. అలాగే 17పార్లమెంట్ లలో కూడా దీక్ష చేస్తాం తెలిపారు. నల్ల చట్టాలు చేసి రైతుల ఆత్మహత్యలకు బీజేపీ కారణమని.. బండి సంజయ్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

Spread the love

Related News