ప్రతిపక్షం, వెబ్ డెస్క్: కుప్పంలో చంద్రబాబు ఓడిపోవడం ఖాయమని వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి జోస్యం చెప్పారు. బుధవారం ట్విట్టర్ వేదికగా.. ‘కుప్పం ఇప్పుడు టీడీపీకి కంచుకోట కాదు. చంద్రబాబు ఓట్ల శాతం తగ్గిపోయింది. 1999లో 74 శాతం ఉండగా, 2004లో 70 శాతం, 2009లో 61.9 శాతం, 2019లో 55 శాతానికి తగ్గింది. రానున్న ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం కన్‌ఫర్మ్. టీడీపీ మాటలే చెబుతుందని, పనులు చేయదని కుప్పం ప్రజలు తెలుసుకున్నారు.’ అని అన్నారు.