ప్రతిపక్షం, జూలై 02: వివాదాస్పద 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) జులై 17న తన నివేదికను ఆమోదించే అవకాశం ఉంది. ఈ బిల్లులో తీవ్రమైన నేరాల కేసుల్లో అరెస్టై 30 రోజుల పాటు కస్టడీలో ఉన్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులను పదవి నుంచి తొలగించే నిబంధనను కొనసాగించే అంశంపై కమిటీ చర్చిస్తున్నట్లు సమాచారం.
అయితే రాజకీయ కక్షసాధింపు కోసం ఈ నిబంధన దుర్వినియోగం కాకుండా తగిన రక్షణ చర్యలను కూడా జేపీసీ సిఫార్సు చేయనున్నట్లు తెలుస్తోంది. నివేదిక ఆమోదం అనంతరం వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

















