కాంగ్రెస్ పై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫైర్
ప్రతి పక్షం, దుబ్బాక మార్చి 27: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే కరువొచ్చిందని, ఎండిన పంట పొలాలకు నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం దుబ్బాక నియోజక వర్గం నార్సింగ్ మండలంలోని నర్సంపల్లి తండాలో ఎండి పోయిన వరి పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాల నుంచి వ్యవసాయం మీద ఆధారపడి బతికే రైతు కుటుంబాలు, తాండా వాసులు పంటలు ఎండిపోవడ తో నష్ట పోవడం జరిగిందన్నారు. పంట పొలాలను కాపాడటానికి ప్రాజెక్టుల గేట్లు ఎత్తాలని, అది మరిచి ప్రతిపక్ష నాయకులను చేర్చు కోవడానికి పార్టీ గేట్లు ఎత్తుతున్నారని విమర్శించారు.