Trending Now

బొడ్రాయి విగ్రహాలకు ఆడపడుచుల అభిషేకాలు

వరంగల్ నగరంలో గల రంగసాయిపేటలో జరుగుతున్న బొడ్రాయి లా ప్రతిష్టాపన సందర్భంగా సోమవారం రాత్రి ఎనిమిది గంటల నుండి అర్ధరాత్రి 2 గంటల వరకు బొడ్రాయి గ్రామ దేవతలకు జలాభిషేకం జరిగినది, రంగసాయిపేట తెలంగాణ కాలనీ ఆదర్శనగర్ సాయి నగర్ కాలనీ రుద్రమ నగర్ కాలనీ ప్రాంతం అంతా బొడ్రాయి ప్రతిష్టాపన సందడి ఓం జెండాలు కొబ్బరి మట్టలతో మామిడి తోరణాలతో బంతి పూలతో వాడలల్లో అలంకరణ చేసుకొని పండుగ వాతావరణం నెలకొంది ఎటు చూసినా ఎటు వెళ్లిన ఏ షాపుకెళ్లిన ఏ వీధిలో కెళ్ళిన చిన్ననాటి స్నేహితులు బంధువులు అందరూ ఈ సందర్భంగా కలుసుకొని చిన్ననాటి జ్ఞాపకాలు బొడ్రాయి ప్రతిష్టాపన సందర్భంగా విదేశాల నుండి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసి బొడ్రాయి గ్రామ దేవతలకు జలాభిషేక కార్యక్రమంలో కుటుంబ సభ్యులు అందరూ కలిసి రాగి బిందెలో నీళ్లను తీసుకొని అక్క చెల్లెల్లు కుటుంబ సభ్యులు అందరూ కలిసి బొడ్రాయి గ్రామ దేవత భూలక్ష్మి మహాలక్ష్మి ప్రతిష్టా వరకు జై భూలక్ష్మి జై మహాలక్ష్మి అంటూ ఆడపడుచులు వీధుల నుండి నినాదాలు చేస్తూ వెళ్లి జలాభిషేకం చేస్తూ నగర ప్రజలు గ్రామ ప్రజలు కుటుంబ సభ్యులు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మొక్కుతూ జలాభిషేకం చేశారు గ్రామ ప్రజలు అందరూ బాగుండాలని ఆడపడుచులు అందరూ అమ్మవారిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో ఆర్ వై ఎఫ్ ప్రతినిధులు బొడ్రాయి కన్వీనర్లు కొల్లూరి యోగానంద్ గుండు పూర్ణచందర్ కెడల జనార్ధన్ వేలాదిమంది ఆడపడుచులు తదితరులు పాల్గొన్నారు

Spread the love