Trending Now

గంజాయిపై ఉక్కు పాదం..

సాంఘిక కార్యకలాపాల నివారణ బాధ్యతలు మనందరివి

నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 27 : నిర్మల్‌లోని వివిధ ప్రాంతాలలో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయని ఆ దానిపై ఉక్కు పాదం మోపెందుకే కఠినమైన రీతిలో చర్యలు తీసుకుంటున్నట్లు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల పేర్కొన్నారు. నిర్మల్, ఖానాపూర్, బైంసా పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో కూడా యువత గంజాయికి అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తును సర్వనాశనం చేసుకుంటున్నారని దీనిని నివారించే బాధ్యత పోలీసులతో పాటు ప్రజలపై కూడా ఉందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైయస్సార్ కాలనీలో నిర్వహించిన పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెతోపాటు నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి, పట్టణ, రూరల్ సీఐలు అనిల్ కుమార్, శ్రీనివాస్ లు పలు దుకాణ సముదాయాలు వాహనాలు ఇతరత్రా వాటిని అణువణువునా తనకీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పట్టుబడ్డ మత్తు పానీయాలు, మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాల్లో ఎక్కడ ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరుగుతున్న తమకు రహస్యంగా సమాచారం అందించాలని దీనిని నివారించవలసిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. ముఖ్యంగా విద్యార్థులు యువత వీటి బారిన పడకుండా చూసుకోవాల్సిందే తల్లిదండ్రులేనని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రోజువారి నాకా బంధీలు నిర్వహిస్తున్నామని ఎన్నికల నియమావళిని దృష్టిలో పెట్టుకొని ఇతర ప్రాంతాలకు జాగ్రత్తగా వెళ్లాలని ఆమె ఈ సందర్భంగా సూచించారు.

రోడ్డు రవాణా శాఖ, పోలీస్ శాఖ ల అనుమతులు అధికారిక ధ్రువీకరణ పత్రాలు లేకుండా వాహనాలను నడపడం చట్ట విరుద్ధమని చెప్పారు. అధికారిక నియమ నిబంధనలకు అనుగుణంగా చోదకులు తమ వాహనాల నిర్వహణను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. తమ పరిసరాలలో ఎలాంటి అనుమానితులు కనిపించిన రహస్యంగా పోలీసులకు సమాచారం అందించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా పలు ద్విచక్ర ఇతర వాహనాలు స్వాధీనం చేసుకొని వాటి అధికారిక అర్హత పత్రాలను పరిశీలించి తగిన జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ప్రవర్తనలో మార్పులు తెచ్చుకున్న పలువురుని గుర్తించి పోలీస్ శాఖ ద్వారా తగిన పురస్కారాలను అందించి శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎస్సైలు, సీఐలు స్థానికులు పాల్గొన్నారు.

Spread the love

Related News