Trending Now

బీఆర్ఎస్‌తోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు..

జడ్పీ చైర్మన్ విజయలక్ష్మి రాం కిషన్ రెడ్డి

నిర్మల్‌లో ఘనంగా ఆవిర్భావ దినోత్సవం..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 27 : తెలంగాణ బాపు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆవిర్భవించిన టీఆర్ఎస్ పోరాటాలు, ఉద్యమాల కారణంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని నిర్మల్ జడ్పీ చైర్మన్ విజయలక్ష్మి రాం కిషన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం నిర్మల్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం గా నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఉద్యమకారులు, విద్యార్థులు ,యువకులు ప్రణాళిక బద్ధమైన రీతిలో చేపట్టిన ఉద్యమాలు త్యాగాల కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని గుర్తించాలన్నారు. వందలాదిమంది అమరవీరులు చేసిన త్యాగాల కారణంగానే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ త్యాగమూర్తి, బాపు కేసీఆర్ చేపట్టిన దీక్షను విరమింపజేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని రాజ్యాంగ బద్ధమైన రీతిలో ప్రకటించడం జరిగిందని తెలిపారు.

బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, మాజీ డీసీసీ అధ్యక్షులు రాం కిషన్ రెడ్డి లు మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత పదేళ్ల పాలు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు సమన్యాయం చేసే సంక్షేమ పథకాలు కార్యక్రమాలను అమలుచేసి తెలంగాణను దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి పథంలోకి ముందు తీసుకెళ్లిందని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ అదిలాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు దాదాను అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మన అందరిపై కూడా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు జోహార్లు అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ మాజీ సభ్యులు మహమ్మద్ నజీరుద్దీన్, సోన్ జెడ్ పి టి సి జీవన్ రెడ్డి, జడ్పి కోఆప్షన్ సభ్యులు డాక్టర్ యు. సుభాష్ రావు, బీఆర్ఎస్ ఆయా విభాగాల పట్టణ మండల స్థాయి నాయకులు పతాధికారులు పాల్గొన్నారు.

Spread the love

Related News