ప్రతి పక్షం, జుక్కల్ మార్చ్ 27: జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం హస్గుల్ గ్రామంలోని గత కొన్ని రోజులుగా మాజీ ఎంపీటీసీ నారాయణ పై ఓ రిపోర్టర్ డబ్బుల కోసం డిమాండ్ చేస్తున్నాడు. ఇప్పుడు మీరు డబ్బులు ఇవ్వకపోతే మీపై ప్రతి న్యూస్ ఛానల్ లో వేయిస్తానని.. తప్పుడు సమాచారంతో బెదరింపులకు పాల్పడుతున్నట్టు ఎంపీటీసీ తెలిపారు. గతంలో తన వద్ద కొన్ని డబ్బులు వసూలు చేసిన్నట్టు పేర్కొన్నారు. ఎంపీటీసీ నారాయణపై అక్రమ ఇసుక దందా నడిపిస్తున్నారని కొన్ని న్యూస్ పేపర్లో.. ఇంతకుముందే కొన్ని న్యూస్ ఛానల్ లో వేయించిన్నట్టు ఎంపీటీసీ తెలిపారు. జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు దృష్టిలో మాజీ ఎంపీటీసీ నారాయాణను బాడ్ చేయాలని ఆ విధంగా తప్పుడు వార్తలను రాస్తున్నట్టు ఆ ఊరి గ్రామ ప్రజలు తెలిపారు.