ప్రతిపక్షం, జూన్ 13: పాస్‌పోర్ట్ దరఖాస్తుల ధ్రువీకరణ ప్రక్రియలో అత్యుత్తమ సేవలు అందించినందుకు తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతిష్ఠాత్మక ఇన్‌స్టిట్యూషనల్ పర్ఫార్మెన్స్ అవార్డు ప్రకటించింది.
జూన్ 19న న్యూఢిల్లీలో నిర్వహించే పాస్‌పోర్ట్ సేవా దివస్ కార్యక్రమంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చేతుల మీదుగా డీజీపీ సీవీ ఆనంద్ ఈ అవార్డును స్వీకరించనున్నారు.
పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం, పారదర్శకత పెంచడం, సాంకేతిక ఆధారిత విధానాలను సమర్థంగా అమలు చేయడం వల్లే ఈ జాతీయ గుర్తింపు లభించిందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. రాష్ట్ర పోలీసు శాఖకు ఈ అవార్డు రావడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

















