యూజీసీ-నెట్ పరీక్షపైనా పేపర్ లీక్ ఆరోపణలు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

ప్రతిపక్షం, జూలై 09: ఇటీవల నిర్వహించిన యూజీసీ-నెట్ (సోషియాలజీ) పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం కూడా లీక్ అయిందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమ వేదికగా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

పరీక్ష నిర్వహణకు కొద్ది రోజుల ముందే దాదాపు 100 పేజీల పీడీఎఫ్ పత్రం బయటకు వచ్చిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆ పత్రం జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) వద్ద మాత్రమే ఉండే గోప్యమైన సమాచారం అని ఆయన ఆరోపించారు. ఆ పీడీఎఫ్‌లోని 90 ప్రశ్నలు యూజీసీ-నెట్ సోషియాలజీ ప్రశ్నపత్రంలోని ప్రశ్నలతో సరిపోలినట్లు తెలిపారు.

ఉత్తరప్రదేశ్, బిహార్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఈ ప్రశ్నపత్రాలను రూ.2.25 లక్షలకు విక్రయించినట్లు సమాచారం ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతపై తీవ్రమైన సందేహాలు వ్యక్తం చేస్తూ, ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

అయితే రాహుల్ గాంధీ చేసిన ఈ ఆరోపణలపై జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.

Spread the love

Related News

Latest News