- కమిషన్ల కోసమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల పెండింగ్?
- కమిషన్ల కోసమే విద్యాశాఖను తన వద్ద పెట్టుకున్న రేవంత్ రెడ్డి
- ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి
ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, జూలై 04: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విద్యారంగంపై ఏ అవగాహన లేదని ,విద్యారంగం పట్ల ఇష్టానుసార నిర్ణయాలు తీసుకుంటూ విద్యారంగాన్ని రేవంత్ రెడ్డి బ్రష్టు పట్టిస్తున్నాడని, విద్యారంగానికి నిధులు ఇవ్వకుండా, ఫీజు బకాయిలు విడుదల చేయకుండా, ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడి అరికట్టకుండా, ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు అంటూ మిగతా ప్రభుత్వ విద్యాసంస్థలను రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నాడని, ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల కమిషన్ల కోసం రేవంత్ రెడ్డి విద్యాశాఖ తన వద్ద పెట్టుకున్నారని, కేంద్ర మంత్రి బండి సంజయ్ నీట్, సీబీఎస్సీ పరీక్షల అవకతవకలపై మాట్లాడకుండా విద్యార్థుల వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నాడని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి ఆరోపించారు ఏఐఎస్ఎఫ్ కరీంనగర్ జిల్లా ఆఫీస్ సమావేశం స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్ లో జరిగింది.ఈ సందర్భంగా కసిరెడ్డి మణికంఠ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 నెలల కావస్తున్న ఇప్పటివరకు విద్యార్థులకు ఇచ్చిన ఎన్నికల హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదని, పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని, ఫీజు బకాయిలు విడుదల కాక యాజమాన్యాలు విద్యార్థులు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పైసలు కట్టి మరీ సర్టిఫికెట్ తీసుకుపోతున్నారని, ఫీజు రియంబర్స్మెంట్ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడితే నేడు రేవంత్ రెడ్డి కమిషన్ల కోసం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నాడని, కాంగ్రెస్ ప్రభుత్వానికి కేరళ ఎన్నికల ప్రచారానికి, వివిధ రాష్ట్రాల్లో పత్రిక ప్రకటనలకు, అందాల పోటీలకు, ఫుట్బాల్ పోటీలకు ఉన్న నిధులు విద్యార్థులకు ఎందుకు ఇవ్వడం లేదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వ విద్య బలోపేతం పట్ల చిత్తశుద్ధి లేదని, 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 తగ్గిస్తామంటే రాష్ట్రంలో ప్రవేట్ విద్యాని ప్రోత్సహించే విధంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని, ఖాళీగా ఉన్న ఎంఈఓ, డీఈవో పోస్టులను భర్తీ చేయకుండా, పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచాలని, పేద విద్యార్థులందరికీ ఆర్టీసీలో ఉచిత బస్ పాస్ లు ఇవ్వాలని, రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి తన వద్ద పెట్టుకొని విద్యారంగ సమస్యలపై విన్నవించడానికి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకుండా నియంతలాగా వ్యవహరిస్తున్నాడని, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నీట్, సీబీఎస్ఈ పేపర్ లీకేజీ దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడితే కేంద్ర మత్రి బండి సంజయ్ ఎందుకు ఒకనాడు కూడా మాట్లాడలేదని, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని గుజరాత్ గులాంలకు బండి సంజయ్ కిషన్ రెడ్డి తాకట్టు పెట్టారని, కేంద్రం నుండి తెలంగాణ విద్యా రంగానికి పెట్టుబడులను, కొత్త విద్యాసంస్థలను తీసుకురాకుండా దద్దమ్మలుగా వ్యవహరిస్తున్నారని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని రాష్ట్ర ఎంపీలు డిమాండ్ చేయాలని,రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఈ నెల 10న నిర్వహించే వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయాలని, బంద్ ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిరసన సెగ చూపాలని, బంద్ కి మద్దతుగా ప్రతి విద్యార్థి బంద్ లో పాల్గొనాలని మణికంఠ రెడ్డి పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మామిడిపల్లి హేమంత్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నునవత్ శ్రీనివాస్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు కనకం సాగర్, జిల్లా నాయకులు కసిరెడ్డి సందీప్ రెడ్డి, బోయిని విష్ణు, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు

















