Trending Now

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను నమ్మవద్దు : మాజీ మంత్రి

ప్రతిపక్షం, హుస్నాబాద్, మే 10 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలొ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో అక్కనపేట చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్ షో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ తక్కళ్ళపల్లి రవీందర్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మార్పు తెస్తామంటే నమ్మి ప్రజలు నమ్మి మోసపోయారని ఈ ఎన్నికల్లో నమ్మవద్దని కోరారు. సీఎం రేవంత్ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ను తిట్టడం దేవుడిపై ఒట్టు పెట్టడం అని అన్నారు. బీడీ కార్మికులకు కాంగ్రెస్, బీజేపీ ఏమి చేయలేదని కేసీఆర్ రెండు వేల పింఛన్ ఇచ్చాడని అన్నారు. కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందని అన్నారు. కెసిఆర్ సీఎం గా ఉన్నప్పుడు 11 సార్లు 72,000 కోట్లు రైతులకు రైతుబంధు ఇచ్చాడని, కరోనా కష్టకాలంలో మంత్రులు ఎమ్మెల్యేల జీతాలు బంద్ చేసి రైతులకు డబ్బులు ఇచ్చామని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి మే 9 వరకు రైతు భరోసా డబ్బులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. మహాలక్ష్మి ద్వారా మహిళలకు 2,500 రూపాయలు కూడా ఇవ్వడం లేదని అన్నారు. కరీంనగర్ మనోహరాబాద్ రైల్వే లైన్ వినోద్ కుమార్ తెచ్చారని బీజేపీ ఎన్నడు రైతుల గురించి పేద ప్రజల గురించి పట్టించుకోలేదని అన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టమన్న పార్టీ బీజేపీ అని బీజేపీ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాస్తుంది అని అన్నారు. దొంగ మాటలు చెప్పే కాంగ్రెస్, బీజేపీ లను నమ్మవద్దని ప్రజలను కోరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ బండి సంజయ్ ని ఓడించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ ను గెలిపించాలని.. కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత, వెంకన్న, వైస్ చైర్మన్ ఐలేని అనితారెడ్డి, కౌన్సిలర్లు కొంకట నళిని దేవి, వాలా సుప్రజా గోవిందు, రవి, బుల్లి కల్పన, బోజు రామ, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News