Trending Now

ఏపీలో పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఏపీలో పెను ప్రమాదం తప్పింది. ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. విజయనగరం జిల్లా కొత్తవలస రైల్వే స్టేషన్ లో విశాఖపట్నం టు భవానీపట్నం వెళ్తున్న ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. లోకో పైలట్ అప్రమతం అవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్యాసింజర్ రైలు విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో సాయంత్రం 6 గంటలకు బయలుదేరగా.. గంట వ్యవధిలోనే కొత్తవలస రైల్వే స్టేషన్ వద్దకు చేరుకోగానే ప్రమాదానికి గురైంది. కొత్తవలస రైల్వే స్టేషన్ ఫ్లాటుఫారం నెంబర్ 5 నుండి బయలుదేరిన రైలు.. రెండో నంబరు లైన్ కు వస్తుండగా ప్రమాదం జరిగింది.

Spread the love