Trending Now

బిజెపి తీర్థం పుచ్చుకున్న నిర్మల్ మాజీ జడ్పీ చైర్మన్ శోభ సత్యనారాయణ గౌడ్..!

ప్రతిపక్షం ప్రతినిధి, నిర్మల్ ,ఏప్రిల్ 20 : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ శోభ సత్యనారాయణ గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి వి.సత్యనారాయణ గౌడ్ నిర్మల్ శాసనసభ్యులు బీజే ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమీక్షంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి చే భాజపా కండవాలు కప్పుకున్నారు. వారితో పాటు నిర్మల్ మున్సిపల్ కౌన్సిలర్లు ఎడిపల్లి నరేందర్ ,బిట్లిన్ నవీన్, ఆధుముల రమ పద్మాకర్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పొడెల్లి గణేష్, సోన్ ఎంపిటిసి దాసరి శ్రీనివాస్, కడ్తాల్ మాజీ సర్పంచ్ వర్మ సాయన్న తాజా మాజీ సర్పంచ్లు వార్డ్ సభ్యులు బిజెపిలో చేరారు. సత్యనారాయణ గౌడ్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో పలు పదవులను చేపట్టి రెండుసార్లు నిర్మల్ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ పొంది పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమిపాలయ్యారు. టిడిపిలోనూ.. బీఆర్ఎస్ లోను ఆయనకు నియోజకవర్గ జిల్లా రాష్ట్రస్థాయి పదవులు దక్కాయి. ఈ కార్యక్రమంలో అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ , సిర్పూర్ కాగజ్నగర్ ఎమ్మెల్యే హరీష్ బాబు,నిర్మల్ మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి,బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అంజు కుమార్ రెడ్డి, మెడిసిమ్మ రాజు సామా రాజేశ్వర్ రెడ్డి ఆదిలాబాద్ పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య, పెద్దపెల్లి ఇంచార్జ్ రావుల రాంనాథ్, నిర్మల్ మున్సిపల్ హైటెక్ కౌన్సిలర్ అయ్యన్న గారి రాజేందర్ తదితరులు ఉండగా హైదరాబాదులో బిజెపి కార్యాలయంలో వారు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు.

Spread the love

Related News

Latest News