Trending Now

‘నిమిషం’ నిబంధనతో నిరాశ..

ప్రతిపక్షం, హైదరాబాద్: నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమన్న ఇంటర్ బోర్డు నిబంధన పిల్లల్లో ఆందోళన రేపుతోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉదయం మొదలైన ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలకు చాలా మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేకపోయారని అంటున్నారు. నిబంధన విధించినప్పుడు ,అందుకు తగిన ముందస్తు చర్యలు తీసుకోవడంలేదని వాపోతున్నారు. కొన్ని పరీక్ష కేంద్రాలు అయిదు నుంచి పది నిమిషాల ముందు మాత్రమే తెరచుకుంటున్నాయని, కొన్ని కేంద్రాలకు సరైన రీతిలో బోర్డులు లేక తికమవకపడుతున్నారని పేరెంట్స్ ఆవేదన చెందుతున్నారు.

ఒక్కొక్కసారి పరీక్ష కేంద్రం మారుతోందని, అక్కడి నుంచి మారిన కేంద్రానికి పరుగులు తీయవలసి వస్తోందని అంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం మాంగుర్లకు చెందిన విద్యార్థి గురువారం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు సకాలంలో చేరుకోలేక మనస్తాపంతో ‘నన్ను నన్ను క్షమించు’ అని లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది వెలుగు చూసిన సంఘటన మాత్రమే. అయినా.. పరీక్ష రాసే అవకాశం కోల్పోవడం బాధాకరమే.. కానీ అంతకంటే విలువైన జీవితాన్ని పణంగా పెట్టడం సరికాదని విద్యార్థిలోకం గమనించాలి.

Spread the love