ప్రతిపక్షం, ఏపీ: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్.. ప్రజాశాంతి పార్టీలో చేరితే సీఎంని చేస్తానని ప్రకటించిన ఆయన.. పవన్ కి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా.. ఎంత డబ్బు కావాలి..? అని ప్రశ్నించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కల్యాణ్, చంద్రబాబు పొత్తుతో ఒకే వేదిక మీద ఉన్న అతనిలో బాధ కనపడిందన్నారు. కాపులు జనసేన, టీడీపి పొత్తుని వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ.. తిరుపతి సాక్షిగా ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తాం అన్నారు. కానీ, ఆ మాట మర్చిపోయారని మండిపడ్డారు. దేశంలో మతతత్వం పెంచుతున్నారు.. జై శ్రీరామ్ అనకపోతే చంపేస్తాం అంటున్నారు. మోడీ పాలనలో ఇతర మతాల ప్రజలకి భద్రత లేదని ఆరోపించారు.