KCR-and‌‌----RS-Praveen-Kumar

తిట్టిపోసిన వారికి పార్టీ పదవులా..?

ప్రతిపక్షం, హైదరాబాద్: భారతీయ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శిగా ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ నియమితులైనట్లే. అధికారిక ప్రకటన రావడమే తరువాయి. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ప్రవీణ్ సోమవారం (నిన్న) బీఆర్ఎస్ లో చేరిన సందర్బంగా పార్టీ అధినేత కేసీఆర్.. ఈ ప్రకటన చేశారు. భవిష్యత్తులోనూ ఆయన ఉన్నత స్థానంలో ఉంటారని కూడా భరోసా ఇచ్చారు. కాగా, కేసీఆర్ ప్రకటన పట్ల పార్టీ శ్రేణుల్లో నిరసన స్వరాలు వినిపిస్తున్నట్లు సమాచారం. పార్టీలోని కొందరు సీనియర్లను కాదని, ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో తీవ్ర విమర్శలు చేసిన వారికి అంత ప్రాధాన్యమా..? అని ప్రశ్నలు వస్తున్నాయి. పార్టీ నుంచి వెళ్లిపోతున్న వారిని నిలువరించకపోగా, ఉన్నవారిని కాదని, కొత్తగా వచ్చిన వారికి అంత ప్రాధాన్యం ఏమిటని పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నట్లు తెలుస్తోంది.

Spread the love

Related News

Latest News