ప్రతిపక్షం, కరీంనగర్ : కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిన్న చిగురుమామిడి మండలంలో జరిగిన ప్రజాహిత యాత్రలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్ మండిపడ్డారు. బండి సంజయ్ కి మతి బ్రమించింది.. పిచ్ఛాసుపాత్రిలో వెంటనే చేర్పించాలని.. దమ్ము, ధైర్యం ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి తప్ప వ్యక్తిగత దూషణలతో పాటు మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం దురదృష్టకరమన్నారు.
తక్షణమే మంత్రి కి క్షమాపణలు చెప్పాలని.. లేకుంటే బండి ప్రజాహిత యాత్రను మేమంతా అడ్డుకుంటామని హెచ్చరించారు. కేవలం దేవుని పేరుతో రాజకీయాలు చేసే నీకు ఓటమి ఖాయం అయిందని.. రాబోయే రోజుల్లో కరీంనగర్ ప్రజలు నిన్ను మళ్లీ కార్పొరేటర్ కి కూడా ఎన్నుకోరన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, కరీంనగర్ నగర బీసీ సెల్ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి రామిడి రాజిరెడ్డి, సిటీ కాంగ్రెస్ నాయకులు వంగల విద్యాసాగర్, గంగుల దిలీప్, అక్బర్ జాఫర్ తదితరులు పాల్గొన్నారు.