Trending Now

పదవ తరగతి పరీక్షా కేంద్రాల్లో పకడ్బందిగా ఏర్పాట్లు..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి : నిర్మల్ జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు పరీక్షలకు సర్వం సిద్ధం చేశారు. పరీక్షలు 18వ తేదీ నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఉదయం 9:30 నుండి 12:30 వరకు జరగనుండగా నిమిషం నిబంధన ఎత్తివేసి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు సైతం పరీక్షలకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని ఇప్పటికే ఈ విషయమై రాష్ట్ర సెకండరీ విద్యాశాఖ కఠినమైన రీతిలో ఆదేశాలు జారీ చేయడం జరిగిందని జిల్లా అధికారి రవీందర్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. జిల్లావ్యాప్తంగా 8,923 మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయనుండగా అందులో బాలురు 4,309, బాలికలు 4,613 మంది, జిల్లావ్యాప్తంగా మొత్తం 47 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రభుత్వ పరీక్ష కేంద్రాలు 37, ప్రైవేట్ పరీక్ష కేంద్రాలు 10, పరీక్షల నిర్వహణ కోసం 493 మంది సిబ్బంది నియమించగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 3, రూట్ ఆఫీసర్లు 5, సహాయ రూట్ అధికారులు 5 లు పరీక్ష కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి తెలిపారు.

పరీక్షలు జరుగుతున్న సమయంలో పరీక్ష కేంద్రాల పరిసరాలలో ఉన్న జిరాక్స్ సెంటర్ల మూసివేతకు ఆదేశాలు జారీ చేసి, పరీక్ష సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు చేసి ఇలాంటి వాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తమ పిల్లల్లో మొదటిసారి బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నారని పరీక్షలకు చదువుకునే సిద్ధమయ్యారని పరీక్షలు రాస్తున్న విద్యార్థులు అందరూ విజయం సాధించాలని ఆకాంక్షించారు.

Spread the love