Nepal Floods: నేపాల్ విలవిల.. 150 మంది మృతి

Nepal Floods efect bihar: కుండపోత వర్షాలకు నేపాల్ విలవిలలాడుతోంది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడడంతో ఇప్పటివరకు 150 మందికిపైగా మృతి చెందినట్లు నేపాల్ సాయిధ దళాలు వెల్లడించాయి. నేపాల్ లో వందల ఇళ్లు నీట మునిగిపోయాయి. పదుల సంఖ్యలు వంతెనలు ధ్వంసమయ్యాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. మృతుల్లో కావ్రే పాలన్ చౌక్ లో 34 మంది, లలిత్ పూర్‌ లో 20 మంది, దాడింగ్‌ లో 15 మంది, ఖాట్మండు లో 12 మంది, మక్వాన్ పూర్‌ లో ఏడుగురు, సింధ్ పాల్ చౌక్‌ లో నలుగురు, డోలఖలో ముగ్గురు, పంచ్ తర్, భక్తపూర్ లలో ఐదుగురు మృతి చెందారు. ఈ వర్షాలకు బీహార్‌లోనూ నదులు ఉధృత్తంగా ప్రవహిస్తున్నాయి. దీంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Related News

Latest News