Hydra: ‘హైడ్రా’ బాధితులతో హరీశ్‌రావు, సబిత సమావేశం

Harish Rao and Sabita meeting with the victims of ‘Hydra’: తమకు న్యాయం జరిగేలా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని, అండగా ఉండాలని హైడ్రా బాధితులు BRSను ఆశ్రయిస్తున్నారు. ఇవాళ పలు ప్రాంతాల నుంచి బాధితులు హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తెలంగాణ భవన్ కార్యాలయానికి చేరుకున్నారు. బాధితులతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బాధితుల మాటలు విన్నారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, దీనిపై ఉద్యమిస్తామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్‌ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో నగర ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారని మండిపడ్డారు. ఇక, ఈ సమావేశానికి కేటీఆర్ కూడా హాజరు కావాల్సి ఉండగా ఆయన జ్వరంతో బాధపడుతున్నారని పార్టీ నేతలు తెలిపారు. కాగా.. హైడ్రా బాధితులు పూర్తి వివరాలతో తమను ఆశ్రయించాలని, కచ్చితంగా న్యాయం చేస్తామని బీఆర్ఎస్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.

Related News

Latest News