“హరిహర వీరమల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్” పేరుతో టీజర్ విడుదల
ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు మూవీ టీజర్ విడుదలైంది. ఈ మూవీని నిర్మిస్తున్న మెగా సూర్య ప్రొడక్షన్స్ టీజర్‌ను విడుదల చేసింది. ఇక ఈ చిత్రం రెండు భాగాలుగా రానుందని తాజాగా చిత్రం యూనిట్ ప్రకటిస్తూ, మొదటి భాగం నుండి టీజర్‌ను విడుదల చేసింది. మొదటి భాగం “హరి హర వీర మల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్” పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. “ధర్మం కోసం యుద్ధం” అనేది ఉపశీర్షిక.