Trending Now

ఆసిఫాబాద్‌లో ఉద్రిక్తత.. రైతులపై ఫారెస్ట్ అధికారుల దాడి

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 10 : ఆసిఫాబాద్( కొమరం భీమ్ )జిల్లాలో ప్రభుత్వ భూములలో పోడు సాగు చేస్తున్న రైతులకు అటవీశాఖ అధికారులకు మధ్య వాగ్వావాదం చోటుచేసుకుంది. (కుమరం భీమ్) ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం తుంగడ గ్రామం అటవీ ప్రాంతంలో కొనేళ్లుగా రైతులు పోడు భూములను సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పోడు రైతులకు ఫారెస్ట్ అధికారులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.

గ్రామంలోని సాగు చేస్తున్న పోడు భూములలోకి అటవీ శాఖ అధికారులు, సిబ్బంది చొచ్చుకొని వెళ్లడంతో సదరు భూములను సాగు చేస్తున్న పోడు రైతులకు వారికి మాటల యుద్ధం మొదలైంది. దీంతో పరిస్థితి చేయి దాటకుండా అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎదురైన పరిస్థితులను సమస్యను అటవీశాఖ అధికారులు.. జిల్లా రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు సాంకేతిక పరిజ్ఞానంతో తెలియజేశారు. ఈ మేరకు సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు జిల్లా కలెక్టర్ అప్రమతమై పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు సమాచారం.

Spread the love

Related News