ప్రతిపక్షం, సిద్దిపేట: తెలంగాణ జానపద ఆశ్రిత కళారూపాల్లో ఒకటైన గోత్రాల కళాకారుడు కొంకల్ల ఎల్లయ్యకు పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్సిటీ పురస్కారం లభించింది. వివిధ రంగాలలో విశేష కృషి చేసిన వారికి ప్రతి ఏడాది ప్రతిభ పురస్కారలతో సత్కరిస్తుంది. ఇటీవల పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీం నగర్ కు చెందిన జానపద కళాకారుడు కొంకుల్ల ఎల్లయ్యను ఎంపిక చేసింది. ఈ నెల 28న హైదరాబాద్ లో వర్శిటీలో ఎల్లయ్య పురస్కారం సత్కరించి, 20,116 నగదు పురస్కారాన్ని అందుజేయనున్నారు. తన తండ్రి నుండి వచ్చిన కళను డెబ్బైఅయిదు ఏటా కూడా కొడుకు సంతోష్ తోపాటు మరి కొందరి సహకారంతో జానపద కళా రూపాలు ప్రదర్శిస్తూ.. జీవితం గడుపుతూ ఉంటాడు. తన స్వస్థలం సిద్దిపేట జిల్లా, చిన్నకోడూరు మండలం లోని ఇబ్రాహీం నగర్ గ్రామానికి చెందిన కొంకుల్ల ఎల్లయ్య బృందం మున్నూరు కాపు, రెడ్డి, కమ్మ కాపు, చౌదరి, మొదలగు కులాల గోత్రాలు చెపుతూ కట్నం స్వీకరిస్తారు.
యక్ష గానం.. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి..
ఆచార సంప్రదాయాలను వివరిస్తూ.. గోత్ర కళాకారులు నాటకాలను ప్రదర్శిస్తారు. నేటి ఆధునిక యుగంలో గ్రామీణ కళలకు ఆదరణ తగ్గాయి. వీధి నాటకాలకు గోత్రాల కళాకారులు జీవం పోస్తారు. సత్యహరిశ్చంద్ర, చెంచు లక్ష్మి, భక్త ప్రహ్లాద, సత్యవర్మ , గంగా కళ్యాణం మొదలగు జానపద కళా రూపాలు ప్రదర్శిస్తూ ఉన్నారు. వీరు తెలంగాణ ప్రాంతాల్లోనే కాకుండా.. మహారాష్ట్రలోని తెలుగు వారు నివసించే ప్రాంతాల్లో కూడా వీరు కళా రూపాలని ప్రదర్శిస్తూ ఉంటారు. వీరికి ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం అందడం లేదు. ఈ జానపద గోత్రాల కళా రూపాలను ప్రదర్శిస్తూ.. వాటిని కాపాడుతూ దయనీయమైన జీవితం గడుపుతున్నారు. కనీసం పింఛన్లు కూడా రావడం అందటం లేదు. తెలంగాణలో జానపద కళారూపాలు మన సంస్కృతి సాంప్రదాయాలు, అస్తిత్వ ఉద్యమ సాహిత్యానికి అద్దం పడుతాయి. కాగా జానపద కళాకారుడు ఎల్లయ్య సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు ఫౌండేషన్ వారు నగదు, పురస్కారం , వెన్నెల సాహితీ పురస్కారం మొదలగు పురస్కారాలు లభించాయి. తెలంగాణ రచయితల వేదిక మీద వీరు తమ కళారూపాన్ని ప్రదర్శించి పలువురి ప్రశంసలు అందుకున్నారు.