Trending Now

ఎమ్మెల్సీలుగా మళ్లీ వారి పేర్లు.. మరోసారి కేబినెట్‌లో తీర్మానం

హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం మరో మారు గవర్నర్​ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రొఫేసర్​ కోదండరాం, అమీర్​ ​అలీఖాన్​ పేర్లను ఖాయం చేసింది. మంగళవారం సీఎం రేవంత్​రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో వీరిద్దరి పేర్లను ఖరారు చేస్తూ మంత్రులు తీర్మానం చేశారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో మరోసారి కేబినెట్ తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. సాయంత్రం వీరిద్దరి పేర్లను గవర్నర్‌కు తెలంగాణ ప్రభుత్వం పంపించనున్నట్లు సమాచారం. కాగా.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా మంత్రిమండలి నామినేట్ చేసింది. అయితే.. ఈ నిర్ణయాన్ని గవర్నర్ తమిళిసై తిరస్కరించిన విషయం తెలిసిందే. దీనిపై.. దాసోజు, కుర్ర సత్యనారాయణలు హైకోర్టును అశ్రయించారు. గవర్నర్ తన పరిధిని అధిగమించారని, మంత్రి మండలికి ఎమ్మెల్సీలను నామినేట్ చేసే హక్కు ఉందని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తెచ్చారు.

Spread the love

Related News

Latest News