ప్రతిపక్షం, జూలై 11: తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినట్లే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 117 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటుందని ఆయన అన్నారు. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య నెలకొన్న వివాదం త్వరలో పరిష్కారమవుతుందని, పార్టీ పరిశీలకుడు సచిన్ సావంత్ దీనిపై చర్యలు తీసుకుంటారని తెలిపారు. హరీశ్ రావుపై జగ్గారెడ్డి పోటీ చేసే అంశాన్ని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (CEC) దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.
















