జైలు నుంచి పోక్సొ నిందితుడు పరారీ

•విస్తృతంగా పోలీసుల గాలింపు

•తప్పించుకున్న నిందితుడు దొరకడంతో ఊపిరిపీల్చుకున్న జైలు అధికారులు

ప్రతిపక్షం, జూలై 06, వనపర్తి ప్రతినిధి: జైలు నుంచి సోమవారం తప్పించుకొని పారిపోయిన నిందితుడు కిషోర్ కుమార్ రెడ్డి ఆచూకీ లభించడంతో జైలు సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.వనపర్తి జిల్లా అమరచింత మండలం నందిమల్ల గ్రామానికి చెందిన కిషోర్ రెడ్డి మైనర్ బాలికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అతడిపై పోక్సో కేసు నమోదు అయింది.దీంతో అతడు 25 రోజులుగా మహబూబ్‌నగర్‌ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. ఇదిలా ఉండగా జైలు నుంచి పరారీ కావడానికి కిషోర్‌ అనేక సార్లు రెక్కి నిర్వహించినట్లు తెలుస్తోంది.తోటి ఖైదీల టవళ్లను తీసుకొని బాత్‌రూం ఎక్కి అక్కడి నుంచి గోడ మీదకు చేరి టవళ్లను ఒకదానికొకటి కట్టి 18 ఫీట్ల గోడ దాటుకొని కిందికి దిగి పరారీ అయినట్లు జైలు సిబ్బంది గుర్తించారు. అనంతరం జైలు అధికారులు వెంటనే స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అటు జైలు సిబ్బంది, పోలీసులు సమీప ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు స్వగ్రామానికి చేరుకుని ఉంటాడని ఆత్మకూరు పోలీసులకు సమాచారం అందించారు.ఇదిలా ఉండగా జైలు నుండి తప్పించుకొని, తన‌ వ్యవసాయ పొలానికి చేరుకున్నాడు.ఈ విష‌యాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు.కుటుంబ సభ్యులు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చూడగా, అప్పటికే నానో యూరియా ద్రావణాన్ని సేవించి ఆత్మహత్యకు కిషోర్ కుమార్ రెడ్డి పాల్పడినట్లు గుర్తించారు.వెంటనే జైలు అధికారులకు కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చి..వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా తప్పించుకున్న నిందితుడు తిరిగి దొరకడంతో జైలు అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

Spread the love

Related News

Latest News