Trending Now

రైతులు మరోసారి ఆందోళనలు..

ఈనెల 6న ఢిల్లీకి రైతులు.. ఈనెల 10న ‘రైల్ రోకో’

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: రైతులు మరోసారి ఆందోళనలకు సిద్దమయ్యారు. ఈనెల 6న ఢిల్లీకి వెళ్లనున్నారు రైతులు. ఈనెల 10 న దేశవ్యాప్తంగా నాలుగు గంటల పాటు రైల్ రోకో నిర్వహించనున్నారు. ఖానౌరీలో హర్యానా భద్రతా సిబ్బందితో జరిగిన ఘర్షణల్లో యువరైతు శుభకరణ్ సింగ్ చనిపోయాడు. పంజాబ్ బఠిండాలోని రైతు శుభకరణ్ సింగ్ సంస్మరణ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో రైతు సంఘాల నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర, రైల్ రోకోపై రైతు సంఘం నాయకులు సర్వన్ సింగ్ పంధేర్, జగ్జీత్ సింగ్ దల్లేవాల్ కీలక ప్రకటన చేశారు. ఈనెల 10న మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రైల్ రోకో చేపడతామని స్పష్టం చేశారు. కాగా.. పంజాబ్, హర్యానా నుంచి రైతులు పాదయాత్రగా ఢిల్లీకి చేరుకుంటారని తెలిపారు.

Spread the love