Trending Now

శివలీలకు స్త్రీ శక్తి పురస్కారం..

ప్రతిపక్షం, నల్గొండ: నల్గొండ జిల్లా కనగల్ మండల కేంద్రానికి చెందిన సామాజిక సేవకులు, వైద్యురాలు కంబాలపల్లి శివలీల “స్త్రీ శక్తి” జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ వారు ఆమె సేవలను గుర్తించి.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాదులో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆమెకు ఈ పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ మీనగ గోపి కి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తానని ఆమె తెలిపారు.

Spread the love

Latest News