నర్మెట్ట గ్రామంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

పూలతో పేర్చిన బతుకమ్మ విజేతలకు బహుమతుల ప్రధానం

ప్రతిపక్షం, నంగునూరు, అక్టోబర్ 19: నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను ఏర్పాటు చేసి, సంప్రదాయ పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టూ ఆడిపాడారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ గ్రామంలో పండుగ వాతావరణాన్ని నింపింది. అనంతరం నర్మెట్ట గ్రామపంచాయతీ పాలకవర్గం తరఫున పూలతో పెద్దగా పేర్చిన బతుకమ్మలకు బహుమతులను అందజేశారు. ప్రథమ బహుమతి కలకుంట్ల పద్మ శ్రీనివాస్ , ద్వితీయ బహుమతి కలకుంట్ల కవిత స్వామి, తృతీయ బహుమతి వెన్నెల సతీశ్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శనిగరం స్వాతి బాబు, ఉప సర్పంచ్ విక్రమ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు అనంతరం బతుకమ్మలను గద్దలాయి చెరువు లో నిమజ్జనం చేశారు.

Spread the love

Related News

Latest News