100 మంది ప్రముఖులకు భద్రత తగ్గింపు.. జులై 1 నుంచి కొత్త నిబంధనలు

ప్రతిపక్షం, జూన్ 29: తెలంగాణలో మావోయిస్టుల ప్రభావం గణనీయంగా తగ్గిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లలో కీలక మార్పులు చేపట్టింది. ఇందులో భాగంగా సుమారు 100 మంది ప్రముఖులకు కల్పిస్తున్న భద్రతను ఉపసంహరించుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

భద్రత తగ్గింపులో భాగంగా కొందరికి కేటాయించిన బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలను, గన్‌మెన్‌లను వెనక్కి తీసుకోనున్నారు. అలాగే ‘వన్ ప్లస్ వన్’ భద్రతను పూర్తిగా తొలగించగా, ‘టూ ప్లస్ టూ’ భద్రతను కూడా తగ్గించనున్నట్లు సమాచారం.

జులై 1 నుంచి ఈ కొత్త మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 600 మంది ప్రముఖులకు ప్రభుత్వం వివిధ స్థాయిల్లో భద్రత కల్పిస్తుండగా, తాజా నిర్ణయంతో భద్రతా వనరుల వినియోగాన్ని అవసరాలకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరించనుంది.

Spread the love

Related News

Latest News